సన్నీ లియోనీ.. శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లాంటి నటే..

     Written by : smtv Desk | Mon, Jun 11, 2018, 12:45 PM

సన్నీ లియోనీ.. శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లాంటి నటే..

ఇండోర్‌, జూన్ 11 : పటేదార్‌ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్‌ బాలీవుడ్‌ నటి సన్నీలియోనీకి మద్దతుగా నిలిచారు. ఓటర్లకు రాజకీయాలపై అవగాహన కల్పించేందుకు హార్దిక్‌ జులై నుంచి మధ్యప్రదేశ్‌లో పాదయాత్ర చేయనున్నారు. ఈ సందర్భంగా తన యాత్రకు సంబంధించిన విషయాలను వెల్లడించేందుకు మీడియాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ విలేకరి 'సన్నీ లియోనీపై మీ అభిప్రాయమేంటి?' అని హార్దిక్‌ను అడిగారు.

ఇందుకు హార్దిక్‌ సమాధానమిస్తూ.." నర్గిస్, శ్రీదేవి, మాధురి దీక్షిత్‌లాంటి నటే సన్నీ లియోనీ కూడా. సన్నీలియోనీని ఇతర నటీనటుల లాగా ఎందుకు చూడరు? గతంలో ఆమె పోర్న్‌స్టార్‌గా పనిచేసిందని ఇప్పుడు కూడా ఆమెను తప్పుడు దృష్టితో చూడటం సరి కాదు. ఒకవేళ మన ఆలోచనా విధానం మారకపోతే దేశం ఎప్పటికీ మారదు" అని అన్నారు. గతంలోనూ హార్దిక్‌ సన్నీకి మద్దతుగా నిలిచారు.





Untitled Document
Advertisements