ఒకటికే దిక్కులేదు.. ఇంకా రెండోదా..

     Written by : smtv Desk | Mon, Jun 11, 2018, 01:51 PM

ఒకటికే దిక్కులేదు.. ఇంకా రెండోదా..

ఢిల్లీ, జూన్ 11 : టీమిండియా క్రికెటర్‌ మహమ్మద్‌ షమి భార్య హసీన్‌ జహాన్‌ మరోసారి భర్తపై ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచింది. రంజాన్‌ పండుగ తర్వాత షమి రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ జహాన్ మరోసారి భర్తపై ఆరోపణలు చేసింది. 'రంజాన్‌ పండుగ అయిన ఐదు రోజుల తర్వాత షమి తన సోదరుడి భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతున్నాడు' అని జహాన్‌ ఆరోపించింది. ఈ వ్యాఖ్యలపై షమి స్పందించాడు. " ఒక్క పెళ్లి చేసుకొనే నానా ఇబ్బందులు పడుతుంటే.. రెండో పెళ్లా? మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేనేమైనా పిచ్చోడిలా కనిపిస్తున్నానా?" అని షమి అంతే దీటుగా సమాధానం ఇచ్చాడు.

తర్వాత ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో తన ప్రదర్శన గురించి మాట్లాడుతూ.."కుటుంబ సమస్యల కారణంగా గత కొద్ది నెలలుగా నేను మంచి ప్రదర్శన చేయలేకపోతున్నా. త్వరలో పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశిస్తున్నా. ఇంగ్లాండ్‌ గడ్డపై రాణిస్తా" అని షమి ఆశాభావం వ్యక్తం చేశాడు. షమికి పలువురి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తనను హత్య చేసేందుకు ప్రయత్నించాడంటూ ఈ ఏడాది మార్చిలో అరోపణలు చేస్తూ జహాన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements