2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలి..

     Written by : smtv Desk | Sun, Jun 17, 2018, 03:40 PM

2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలి..

న్యూఢిల్లీ, జూన్ 17 : నీతి ఆయోగ్‌ పాలకమండలి నాలుగో సమావేశం ఢిల్లీలోని రాష్ట్రపతిభవన్‌లో సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. దేశంలో చరిత్రాత్మక మార్పును తీసుకొచ్చేందుకు నీతి ఆయోగ్‌ పాలకమండలి వేదికవుతుందన్నారు. సహకార, పోటీతత్వ సమాఖ్య దేశాన్ని అందించేందుకు 'టీం ఇండియా' పాలన అనేది ఓ సంక్లిష్ట సమస్య. దీనిపై పాలకమండలి సమీక్షిస్తోంది.

స్వచ్ఛభారత్ మిషన్‌, డిజిటల్‌ లావాదేవీలు, నైపుణ్యాభివృద్ధి లాంటి కార్యక్రమాల కోసం కొన్ని కమిటీలు ఏర్పాటు చేశాం. ఆ కమిటీల ద్వారా విధానపరమైన నిర్ణయాల్లో రాష్ట్రాల ముఖ్యమంత్రులు కీలక పాత్ర పోషిస్తున్నార౦టూ పేర్కొన్నారు. అలాగే 2022 నాటికి సరికొత్త భారతాన్ని నిర్మించాలన్న మోదీ.. పలు ప్రభుత్వ పథకాలు, వాటి నుంచి ప్రజలు లబ్ధిపొందుతున్న తీరును వివరించారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో సంభవిస్తున్న వరదలపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆ రాష్ట్రాలకు కేంద్రం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.





Untitled Document
Advertisements