మరో ప్రాజెక్ట్ ప్రకటించిన వర్మ..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 12:37 PM

మరో ప్రాజెక్ట్ ప్రకటించిన వర్మ..

హైదరాబాద్, జూన్ 18 : సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తన తదుపరి సినిమాకు సంబంధించి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. తెలుగు, కన్నడ భాషలలో 'భైరవగీతం' అనే సినిమాకు తను నిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ప్రకటించారు. అణగారిన వర్గాలపై భూస్వామ్య వ్యవస్థను ఎదిరించే ఓ వ్యక్తి ప్రేమకథను.. నిజ జీవితానికి దగ్గరగా చూపబోతున్నారట. ఈ సినిమాకు సిద్ధార్ద్ దర్శకత్వం వహిస్తుండగా.. కన్నడ నటుడు దాలి ధనుంజయ్ హీరోగా నటించనున్నారు.

నటుడు ధనుంజయ్ ఇటీవల జరిగిన 65వ సౌత్ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కార్యక్రమంలో ఉత్తమ నటుడు (కన్నడ-క్రిటిక్)‌ అవార్డు అందుకున్నారు. అయితే ఈ సినిమాకు తనతోపాటు భాస్కర్‌ రశీ సినిమా నిర్మాణ బాధ్యతల్ని చూసుకుంటున్నట్లు వర్మ పేర్కొన్నారు. కాగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను జూన్‌ 21న ప్రేక్షకుల రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. 'ఆఫీసర్' అంటూ కింగ్ నాగార్జునతో వర్మ తీసిన చిత్రం ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారా.? లేదా.? అన్నది అనుమానమే. ఏం జరుగుతుందో చూడాలి మరి.





Untitled Document
Advertisements