అనుష్క శర్మ పై అగ్రహిస్తున్న నెటిజన్లు..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 01:05 PM

అనుష్క శర్మ పై అగ్రహిస్తున్న నెటిజన్లు..

ముంబై, జూన్ 18 : ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ.. తాజాగా రోడ్డుపై చెత్తను పడేసిన వ్యక్తిని చెత్త డబ్బాను వాడండి.. అని సున్నితంగా మందలించిన విషయం తెలిసిందే. కాగా ఈ ఘటనపై నెటిజన్లు అనుష్క శర్మ, ఆమె భర్త విరాట్‌ కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అనుష్క, విరాట్‌ కలిసి కారులో వెళుతుండగా పక్కనే కారులో వెళుతున్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి ప్లాస్టిక్‌ కవరును రోడ్డుపై పడేశాడు. అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుష్క అతన్ని తిడుతున్నప్పుడు పక్కనే ఉన్న విరాట్‌ వీడియో తీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

'వీళ్లా దేశాన్ని పరిశుభ్రంగా ఉంచేది? ఎవరైనా చెత్త పడేయడం చూసినప్పుడు మీరూ ఇలానే వారిని ప్రశ్నించండి. అవగాహన కల్పించండి’ అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత అర్హాన్‌ సింగ్‌ ఫేస్‌బుక్‌ ద్వారా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. కానీ అనుష్క, విరాట్‌ తన పట్ల ప్రవర్తించిన తీరును విమర్శించారు. 'నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసింది. ఇది మీకు మర్యాద అనిపించుకోదు' అని పేర్కొన్నారు. ఈ ఘటనపై అర్హాన్‌ తల్లి కూడా స్పందించారు. తన కుమారుడు చేసింది తప్పే కానీ అతన్ని పట్టుకుని రోడ్డుపై తిట్టడం సరైన విధానం కాదని అన్నారు. వీరితో పాటు నెటిజన్లు కూడా అనుష్కపై మండిపడుతున్నారు.

>> 'చెత్తపడేశాడని అనుష్క తిట్టడంలో తప్పులేదు. కానీ ఆ వ్యక్తి వివరాలు షేర్‌ చేయాల్సిన అవసరం ఏముంది?'

>> 'అనుష్క..రోడ్డుపై వెళ్లే వారినే కాదు మైదానంలో నోటికొచ్చినట్లు తిట్టే నీ భర్తను కూడా నియంత్రణలో పెట్టుకో'

>> 'కోహ్లీ..మీ భార్య హీరోయిజాన్ని వీడియో తీసి అంతర్జాలంలో పెట్టాల్సిన పని ఏముంది? ఇలా రోడ్డుపై చెత్త వేసేవారిని తొలిసారి చూస్తున్నారా? ఒకవేళ అతనికి చెప్పాలంటే స్నేహపూర్వకంగా మాట్లాడాలి. అంతేకానీ అలా అరిచి చెప్పాల్సిన అవసరం లేదు' అంటూ కామెంట్లు పెడుతున్నారు.













Untitled Document
Advertisements