ఆ వివాదాలను15 రోజుల్లోగా పరిష్కరించండి : కేటీఆర్‌

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 05:29 PM

ఆ వివాదాలను15 రోజుల్లోగా పరిష్కరించండి : కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్ 18: బీఎన్‌ రెడ్డి నగర్‌, సాహేబ్‌నగర్‌తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యల్ని పరిష్కారానికి ఎల్బీనగర్‌లోని జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న రెవెన్యూ సంబంధిత సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల నాగోలులో జరిగిన 'మన నగరం' కార్యక్రమంలో రెవెన్యూ సంబంధిత సమస్యల్ని స్థానిక ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సర్వే నెం 104, 102లకు సంబంధించిన వివాదాలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

అసెంబ్లీ వర్షాకాల సమావేశంలోగా ఎల్బీనగర్‌ నియోజకవర్గంలోని అసైన్డ్‌ భూముల వివాదాలను ఓ కొలిక్కి తీసుకొస్తామన్నారు. మన్సురాబాద్‌లోని ప్రెస్‌కాలనీ, వాంబే కాలనీ లోని ఇప్పటికీ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకోనివారికి మరోసారి జీవో 58, 59కింద దరఖాస్తు చేసుకొనేందుకు అవకాశం ఇస్తామని స్పష్టంచేశారు. హస్తినాపురం జనార్దన్‌రెడ్డి కాలనీలలో స్వాతంత్ర్య సమరయోధుల భూములకు సంబంధించి పదేళ్లు పూర్తయినందున రిజిస్ట్రేషన్‌ చేయించుకొనేందుకు ఎన్‌వోసీలు అందిస్తామని కేటీఆర్‌ వెల్లడించారు.





Untitled Document
Advertisements