ఆయన ఆశయాలతో ముందుకెళ్తున్నాం: కేటీఆర్‌

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 04:00 PM

ఆయన ఆశయాలతో ముందుకెళ్తున్నాం: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూన్ 21 : నీళ్లు, నిధులు, నియామకాలు దక్కడమే ఆచార్య జయశంకర్ సార్‌కు నిజమైన నివాళి అని కేటీఆర్‌ అన్నారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని.. సార్ ఆత్మ ఎక్కుడున్నా శాంతిస్తుందని పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఆచార్య జయశంకర్ ఏడో వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు, తెరాస నేతలు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.

జీవితాంతం తెలంగాణ రాష్ట్రం కోసం తపించిన జయశంకర్ సార్‌ అని, నాలుగు కోట్ల ప్రజలను జాగృతం చేశారని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. జయశంకర్‌కు నివాళిగా ఆయన పేరిట జిల్లా ఏర్పాటుతో పాటు వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పేరు పెట్టుకున్నామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణంగా ఆ దిశగా ముందుకు సాగుతోందని చెప్పారు. తాను కలలుగన్న తెలంగాణను చూసే అవకాశం జయశంకర్ సార్‌కు దక్కకపోవడమే అందరి బాధ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements