మరోసారి నాని సరసన కీర్తి..!!

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 06:52 PM

మరోసారి నాని సరసన కీర్తి..!!

చెన్నై, జూన్ 22 : నేచురల్ స్టార్ నాని.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించనున్న విషయం తెలిసిందే. పూర్తిగా క్రికెట్ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకి ఇటీవల 'జెర్సీ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందుకోసం నాని క్రికెట్లో శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కథానాయికగా ఎవరు నటిస్తారనే విషయాన్ని చిత్రయూనిట్ ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదివరకే నాని, కీర్తి కాంబినేషన్ లో "నేను లోకల్" సినిమా వచ్చింది. ఈ సినిమా విజయం సాధించడం.. అలాగే కీర్తి నటించిన "మహానటి" చిత్రం ఘన విజయం సాధించడంతో నాని కూడా కీర్తి సురేశ్ ఎంపిక వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. దర్శకనిర్మాతలు ఇందుకోసం హీరోయిన్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. మొత్తానికి నాని, కీర్తి ల జంట మరోసారి రిపీట్ కానుందన్నమాట. కాగా కీర్తి ప్రస్తుతం తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. నాని.. నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు.





Untitled Document
Advertisements