ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపిన మహారాష్ట్ర ..

     Written by : smtv Desk | Sat, Jun 23, 2018, 11:44 AM

ప్లాస్టిక్‌పై ఉక్కుపాదం మోపిన మహారాష్ట్ర ..

ముంబై, జూన్ 23 : ప్రపంచ పర్యావరణానికి పెనుముప్పుగా సంభవించిన ప్లాస్టిక్ పై మహారాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలో ప్లాస్టిక్‌పై నిషేధం విధిస్తున్నట్లు.. శనివారం నుంచి ఈ నిషేధం అమల్లోకి వస్తున్నట్లు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రామదాస్‌ కదమ్‌ తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసే కంపెనీలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. సామాన్య ప్రజలను, చిన్న చిన్న వ్యాపారులను అంతగా వేధించబోమని తెలిపారు.

మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో చర్చించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రమాదకరమైన ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, ఉపయోగం, అమ్మకం, నిల్వ, సరఫరాపై నిషేధం విధిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 23న వెల్లడించింది. ఒకసారి ఉపయోగించి పడేసే ప్లాస్టిక్‌ కవర్లు, ప్లేట్లు, స్పూన్లు, కొన్ని రకాల బాటిళ్లు, థర్మాకోల్‌ వస్తువులు తదితర వాటిపై ఈ నిషేధం విధించింది.

అప్పటికే ఉన్న స్టాక్‌ను డిస్పోజ్‌ చేయడం కోసం తయారీదారులకు మూడు నెలల సమయం ఇచ్చింది. రానున్న ఎనిమిది రోజుల్లో ఈ ప్లాస్టిక్‌ నిషేధంపై విస్తృతంగా ప్రచారం చేస్తామని కదమ్‌ వెల్లడించారు. జరిమానాల విషయంలోచాలా కఠినంగా వ్యవహరిస్తామని ఆయన అన్నారు. మొదటి సారి పట్టుబడితే రూ.5వేల రూపాయలు, రెండోసారి పట్టుబడితే రూ.10వేల జరిమానా విధిస్తామని తెలిపారు. మూడో సారి కూడా పట్టుబడితే రూ.25వేల జరిమానా, మూడు నెలల జైలు శిక్ష విధిస్తామని స్పష్టంచేశారు.





Untitled Document
Advertisements