సినిమాను మళ్ళీ వాడేశారుగా..!!

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 11:47 AM

సినిమాను మళ్ళీ వాడేశారుగా..!!

హైదరాబాద్, జూన్ 23 : ట్రాఫిక్ విషయంలో వాహనదారులకు అవగాహన కల్పించడంలో ముంబై పోలీసులది ప్రత్యేక శైలీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాలను గాని.. ప్రస్తుత పరిస్థితులను ఉద్దేశించి ఆధునాతన టెక్నాలజీతో ప్రచారాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే ధడక్ చిత్రాన్ని తమ ప్రచారానికి అస్త్రంగా వాడుకుంటున్నారు. జాన్వి కపూర్‌, ఇషాన్ ఖత్తర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలోని ఒక డైలాగ్ ను ఉపయోగించి ముంబై పోలీసులు చేసిన ప్రయత్నం నెటిజన్ల ప్రశంసలను అందుకుంటోంది.

ఈ మేరకు ముంబై పోలీసులు ట్విట్టర్ వేదికగా.. 'ట్రాఫిక్‌ సిగ్నళ్ల ఉద్వేగ సూచి (ఎమోషనల్‌ కోషియెంట్‌)ను తక్కువ అంచనా వేయకండి. అవి ఇచ్చే ఈ-చలానాలు మీకంత మంచిది కాదు' అని ట్వీట్‌ చేశారు. అంతేకాదు జాన్వీ, ఇషాన్‌ ఫొటోలపై ట్రాఫిక్‌ సిగ్నళ్ల గుర్తులుగా చేసి ఆఫొటోపై "ఏం నాటకాలు ఆడుతున్నావ్‌? నేను చూడలేదనుకుంటున్నావా?" అనే అర్థం వచ్చేలా ఫోటోలను ఎడిట్ చేశారు. శశాంత్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. జులై 20న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Untitled Document
Advertisements