ఆన్ ‌'లైన్‌' కడుతున్నారు..!

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 02:55 PM

ఆన్ ‌'లైన్‌' కడుతున్నారు..!

ఢిల్లీ, జూన్ 24 : ప్రస్తుతం సమాజంలో చాలా మంది షాపింగ్‌కు అర్ధమే మార్చేశారు. ఒకప్పుడు జనం షాప్స్ కు వెళ్లి వస్తువులు కొనుగోలు చేసే వారు. ఇప్పుడు ఆ ధోరణి మారి ఆన్‌లైన్‌ ప్రపంచం విస్తరిస్తుంది. అందుకు తగ్గట్టు కొన్ని సంస్థలు కూడా వినయోగాదారుల అభిరుచి మేరకు మంచి ఆఫర్స్ తో ముందుకు వస్తున్నాయి. భారత్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. 2018లో ఆన్‌లైన్‌ షాపర్ల సంఖ్య 120 మిలియన్లను దాటగలదని ఓ నివేదిక వెల్లడించింది. వేగంగా పెరుగుతున్న డేటా వినియోగం, ఈ కామర్స్‌ వెబ్‌సైట్లలో లభించే ఆకర్షణీయమైన ఆఫర్లు ఇందుకు కారణాలుగా పేర్కొంది.

అసోచామ్‌-రీసర్జెంట్‌ సంయుక్తంగా ఆన్‌లైన్‌ షాపింగ్‌పై సర్వే నిర్వహించింది. ఆన్‌లైన్‌ షాపింగ్‌ వార్షిక వృద్ధిరేటు ఈ ఏడాది 115శాతానికి చేరుకుంటుందని అంచనా వేసింది. గత ఏడాది 108 మిలియన్‌ వినియోగదారులు ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసినట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌ షాపింగ్‌కు మొబైల్‌ ఫోన్లే ఉత్తమ ఎంపిక అని తేలిందని చెప్పింది. ఉపకరణాలు, అందం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్‌ పరికరాలను ఎక్కువగా ఆన్‌లైన్‌లోనే కొంటున్నారని నివేదిక వెల్లడించింది.

ఆకట్టుకునే ఆఫర్లు, వేగవంతమైన డెలివరీ, క్యాష్‌ ఆన్‌ డెలివరీ లాంటి సదుపాయాలు ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసేందుకు ప్రేరిపిస్తున్నాయి. అయితే ఆన్‌లైన్‌ షాపింగ్‌లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని పేర్కొంది. కొనుకునే వస్తువులను తాకి చూసే అవకాశం ఉండకపోవడం, వస్తువుల నాణ్యతను గుర్తించే సదుపాయం లేకపోవడం, ఆర్థిక వివరాలను ఆన్‌లైన్‌లో పంచుకోవడం లాంటి భయాలు యూజర్లలో ఉన్నాయని సర్వే వెల్లడించింది.

Untitled Document
Advertisements