'చినబాబు' ప్రతి రైతన్నకు అంకిత౦..

     Written by : smtv Desk | Sun, Jun 24, 2018, 03:01 PM

'చినబాబు' ప్రతి రైతన్నకు అంకిత౦..

హైదరాబాద్, జూన్ 23 : ప్రముఖ కథానాయకుడు కార్తీ, సాయేషా జంటగా పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'చినబాబు'. హీరో సూర్య, 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి ద్వారకా క్రియేషన్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి వైజాగ్‌లో ఆడియో వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా కార్తీ అన్నయ సూర్య హాజరయ్యారు.

ఈ వేడుకలో కార్తీ మాట్లాడుతూ.. "నన్ను, అన్నయ్యను సపోర్ట్‌ చేస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ రోజుల్లో రైతును మర్చిపోతున్నారు. ఇలాంటి సమయంలో రైతును గుర్తు చేసుకొనే విధంగా సినిమా చెయ్యడం గర్వంగా ఉంది. అన్నయ్యకి ఈ సినిమా చాలా నచ్చింది. వచ్చే నెల ఈ సినిమాని రిలీజ్‌ చేయబోతున్నాం. అందరూ కలిసి ఉండాలని చెప్పే సినిమా ఇది" అంటూ చెప్పుకొచ్చారు.

ఎప్పుడూ తమ్ముడిని పెద్దగా పొగడని సూర్య.. ఈ 'చినబాబు' సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా తమ్ముడిపై ప్రశంసలు కురిపించాడు. ఒక సోదరుడు ఉంటే పెద్ద సైన్యాన్నయినా ఓడించవచ్చని.. తనకు కార్తి అలాంటి సోదరుడే అన్నారు. కార్తీ సినిమాల ఎంపిక చూస్తే తనకు గర్వంగా అనిపిస్తుందని.. వైవిధ్యమైన సినిమాలతో సాగిపోతున్నాడని చెప్పుకొచ్చాడు. 'చినబాబు' సినిమా రైతుల మీద తీసిందని.. ఈ సినిమా వాళ్లకే అంకితమని సూర్య తెలిపాడు.

Untitled Document
Advertisements