'జియో ఫై' @ 499..

     Written by : smtv Desk | Tue, Jul 03, 2018, 06:13 PM

'జియో ఫై' @ 499..

హైదరాబాద్, జూలై 3 : టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో భారీ ఆఫర్‌ను ప్రకటించింది. జియోఫై పోర్టబుల్ 4జీ రూటర్‌ను కేవలం రూ.499కే పొందేలా వీలు కల్పించింది. నిజానికి దీని అసలు ధర రూ.1999 కాగా, గతేడాది సెప్టెంబరులో ధరను రూ.999కి తగ్గించింది. ప్రస్తుతం ఈ ధరపై కూడా రూ.500 క్యాష్ బ్యాక్ ప్రకటించడంతో పోర్టబుల్ 4జీ రూటర్‌ను కేవలం రూ.499కే పొందేలా వీలు కల్పించింది.

జియో 4జీ రూటర్‌ కొనుగోలు చేసిన వారు ఉచితంగా సిమ్‌కార్డును పొందవచ్చు. అయితే, వినియోగదారులు రూ.199 పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. తరువాత ఆ ప్లాన్‌లో ఏడాది పాటు కొనసాగితే 12 నెలల అనంతరం రూ.500 క్యాష్‌బ్యాక్‌ను ఇస్తారు. ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లో కస్టమర్లకు నెలకు 25 జీబీ డేటా, అన్‌లిమిటెల్ కాల్స్, ఎస్‌ఎంఎస్‌లు వస్తాయి. జియోఫై 4జీ రూటర్‌ జియో స్టోర్లు, అమెజాన్‌ ఇండియా, ఫ్లిప్‌కార్ట్ ల్లో కొనుగోలు చేయొచ్చు.

Untitled Document
Advertisements