కొత్త గ్రహం 'పీడీఎస్ 70'..!!

     Written by : smtv Desk | Tue, Jul 03, 2018, 07:01 PM

కొత్త గ్రహం 'పీడీఎస్ 70'..!!

బెర్లిన్, జూలై 3 : గ్రహాలు మళ్ళీ తొమ్మిది కానున్నాయా..! అంటే అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు. తాజాగా జర్మనీలోని హీడెల్‌బర్గ్‌లో ఉన్న మాక్స్ ప్లాంక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోనామీకి చెందిన ఆస్ట్రోనామర్లు ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నట్లు వెల్లడించారు. ఈ గ్రహానికి సంబంధించిన తొలి ఫొటోను కొందరు ఆస్ట్రోనామర్లు తీసినట్లు యురోపియన్ సదర్న్ అబ్జర్వేటరీ వెల్లడించింది. వీరు ఈ ఫోటోను సుదూరంలో ఉన్న గ్రహాల ఫొటోలను తీయగలిగే అతిపెద్ద టెలిస్కోప్ అయిన స్పియర్ (SPHERE)ను ఉపయోగించి తీయగలిగారు.

ఈ కొత్త గ్రహానికి సంబంధించిన మరింత సమాచారాన్ని ఆస్ట్రోనామర్స్ సేకరించే పనిలో ఉన్నారు. ఈ గ్రహానికి 'పీడీఎస్ 70' అని నామకరణం చేశారు. ఓ యువ నక్షత్రానికి సమీపంలో వాయువులు, దుమ్ముదూళి ఏర్పడిన మిశ్రమాన్ని ఈ ఫొటోలో గుర్తించవచ్చు. ఈ నక్షత్రానికి 300 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఈ గ్రహం ఉన్నట్లు గుర్తించారు. అనగా సౌరకుటుంబంలో సూర్యుడికి, చివరి నుంచి రెండో గ్రహమైన యురేనస్‌కు మధ్య ఉన్నంత దూరమిది.

Untitled Document
Advertisements