స్టంపింగ్స్‌ రారాజు ధోనినే..

     Written by : smtv Desk | Wed, Jul 04, 2018, 06:20 PM

స్టంపింగ్స్‌ రారాజు ధోనినే..

మాంచెస్టర్‌, జూలై 4 : టీమిండియా క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ టీ20ల్లో నంబర్‌వన్‌ వికెట్‌ కీపర్‌గా అవతరించాడు. మూడు టీ20ల భాగంగా మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో ఎనిమిది వికెట్ల తేడాతో కోహ్లి సేన ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో అద్భుతంగా కీపింగ్‌ చేసి భారత విజయంలో తనవంతు పాత్ర పోషించిన వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అరుదైన రికార్డు నెలకొల్పాడు.

ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జో రూట్‌ను స్టంపౌట్‌ చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌గా మహేంద్రుడు ప్రపంచ రికార్డ్‌ సాధించాడు. పాకిస్తాన్‌ వికెట్‌ కీపర్‌ కమ్రాన్‌ అక్మల్‌ పేరిట ఉన్న రికార్డును ‘మిస్టర్‌ కూల్‌’ ధోని అధిగమించాడు. ఇప్పటి వరకు 91 మ్యాచ్‌లాడిన ధోనీ 90 ఇన్నింగ్స్‌ల ద్వారా 33 స్టంపౌట్లు చేశాడు. కమ్రాన్‌ అక్మల్‌ (32, పాకిస్థాన్‌), మహమ్మద్‌ షజాద్‌(28, అఫ్గానిస్థాన్‌) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. వన్డేల్లో కూడా ప్రస్తుతం ధోనీనే నంబర్‌వన్‌ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు అతడు 107 స్టంపౌట్లు చేసి అందరికంటే ముందున్నాడు.

టీ20ల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన వికెట్‌ కీపర్లు..

>> 33- ఎంఎస్‌ ధోని
>> 32 -కమ్రాన్‌ అక్మల్‌
>> 28 -మహ్మద్‌ షెహజాద్‌
>> 26 - ముష్ఫీకర్‌ రహీం
>> 20 -కుమార సంగక్కర





Untitled Document
Advertisements