ప్రశ్నిస్తే.. బహిష్కరిస్తారా..!

     Written by : smtv Desk | Wed, Jul 11, 2018, 03:55 PM

ప్రశ్నిస్తే.. బహిష్కరిస్తారా..!

హైదరాబాద్, జూలై 11 : ప్రశ్నించడం ఉండాలి!!

కానీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు అనేవి కూడా చాలా అవసరం..అయితే వేసే ప్రశ్న ఎటువంటిదొ తెలుసుకోవడం తప్పనిసరి.

135 కోట్ల భారత దేశ జనాభాలో 'మతం' అనే విషయం కీలక పాత్ర వహిస్తుంది. మతాల వారిగా ఒక్కొక్కరిది ఒక్కొ భావన. కానీ ఒక మతాన్ని కించేపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సబబు కాదు.

అయితే సినీ విమర్శకుడు కత్తి మహేష్ మాత్రం హిందువులు దైవంగా ఆరాధించే శ్రీరాముడుపై పలు వ్యాఖ్యలు చేసిన కారణంగా నగరం నుండి ఆరు నెలల పాటు బహిష్కరణ విధించిన విషయం తెలిసిందే. అసలు గమనించాల్సిన విషయమేమిటంటే.. ఈ వ్యాఖ్యల అనంతరం అన్ని వర్గాల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవడంతో కత్తి మహేష్ ఇప్పుడు తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం....

"నేను చెప్పింది నా అభిప్రాయం. ఎందుకు అందరూ ఈ విషయాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు" అని ఆయన చెప్పడం కొసమెరుపు.

"రాజ్యాంగం తనకు హక్కులు ఇచ్చిందని" చెప్పుకొనే కత్తి మహేష్ ఒక మతాన్ని కించేపరిచే విధంగా మాట్లాడం సరైనదే అని వాదించడం అయన మూర్ఖత్వానికి నిలువెత్తు ప్రదర్శన అని చెప్పక తప్పట్లేదు.

ఇదిలా ఉండగా శ్రీ పీఠాధిపతి స్వామి పరిపూర్ణానందపై కూడా హైదరాబాద్‌ పోలీసులు నగర బహిష్కరణ విధించారు. కాగా ఈ విషయమై పలువురు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్వామి పరిపూర్ణానంద హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ధర్మయాత్ర చేస్తాన‌నే పట్టుదలతో ఉన్నారు. అయితే ప్రశ్నించడం ఎదో తప్పుగా చూపిస్తూ తెలంగాణ సర్కారు ఈ చర్యకు పాల్పడటం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

"మతాన్ని, మతపరమైన విలువల్ని పరిరక్షించుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదని సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి హక్కు. దాన్ని గృహ నిర్భంధం చేస్తూ.. ఇలా నగర బహిష్కరణ చేయడం చాలా ఘోరమని," విపక్షాలు తీవ్ర స్థాయిలోమండిపడుతున్నాయి.

నిజానికి, ఈ వివాదాన్నిఅడ్డుపెట్టుకుని తెలంగాణ‌లో బీజేపీ అధికార పార్టీను ఇరకాటంలో పెట్టాలనే యోచనలో ఉందని.. దీంతో ప్ర‌భుత్వం ఇలా స్పందించి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అయితే పోలీసులు పరిపూర్ణానంద‌ను న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేసింది క‌త్తి మ‌హేష్ వివాదం నేప‌థ్యంలో త‌లెత్తిన ప‌రిస్థితుల‌పై కాదని.. గత న‌వంబ‌ర్ లో చేసిన ఒక ప్రసంగం కారణంగా వాటిపై ఫిర్యాదులు తలెత్తడంతో ఇప్పుడు స్పందిచామని చెబుతున్నారు.

అంతేగానీ, తాజాగా ఆయ‌న త‌ల‌పెట్టిన ధ‌ర్మాగ్ర‌హ యాత్ర‌ కార‌ణంగా అని పోలీసులు చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. స్వామి ప‌రిపూర్ణానంద‌ను న‌గ‌ర బ‌హిష్క‌ర‌ణ చేయ‌డం వ‌ల్ల ఆయ‌న‌కి మ‌ద్ద‌తు పెరిగే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా మొత్తానికి తెలంగాణ సర్కారు ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి మరి.





Untitled Document
Advertisements