క్లీన్ స్వీప్ చేస్తే.. అగ్రస్థానం మనదే..

     Written by : smtv Desk | Thu, Jul 12, 2018, 01:40 PM

క్లీన్ స్వీప్ చేస్తే.. అగ్రస్థానం మనదే..

ఇంగ్లాండ్, జూలై 12 : ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న కోహ్లిసేన మూడు టీ-20ల సిరీస్ ను దక్కించుకొని ఘనమైన ఆరంభాన్ని దక్కించుకొంది. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ తో మొదటి వన్డే కు ఈ రోజు టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం వన్డే ర్యాంకింగ్స్‌లో 126 రేటింగ్‌ పాయింట్లతో ఇంగ్లండ్‌ టాప్‌లో ఉండగా..123 పాయింట్లతో కోహ్లి సేన రెండో ర్యాంకులో కొనసాగుతోంది. గత మే నెలలో ఇంగ్లండ్‌ భారత్‌ను వెనక్కు నెట్టి తొలి ర్యాంకును సాధించింది. అయితే భారత్‌ మళ్లీ ఆ ర్యాంకు పొందాలంటే ప్రస్తుత వన్డే సిరీస్‌ను 3-0తో వైట్‌ వాష్‌ చేయాలి.

ఇక ఇంగ్లండ్‌ సైతం అగ్రస్థానాన్ని నిలబెట్టుకోవాలంటే మరో 10 పాయింట్లు సాధించాలి. భారత్‌ను వైట్‌వాష్‌ చేస్తేనే సాధ్యమవుతోంది. అయితే టీ20 సిరీస్‌లో భారత్‌ విజయం సాధించివుండొచ్చు. కానీ వన్డేలో ఇంగ్లాండ్‌ను ఓడించడం అంత సులభం కాదు. 2015 ప్రపంచకప్‌ తర్వాత వన్డేల్లో మేటి రికార్డు ఇంగ్లాండ్‌దే. 46 వన్డేల్లో గెలిచిన ఆ జట్టు కేవలం 19 వన్డేల్లో మాత్రమే ఓడిపోయింది. ఇరు జట్లు బలాల పరంగా సమతూకంగా ఉన్నాయి కనుక పోరు రసవత్తరంగా మారనుంది.

ప్రస్తుత ర్యాంకులు
1. ఇంగ్లండ్‌ 126 రేటింగ్‌ పాయింట్స్‌
2. భారత్‌ 123
3. దక్షిణాఫ్రికా 113
4. న్యూజిలాండ్‌ 112
5. పాకిస్తాన్‌ 102





Untitled Document
Advertisements