వారి కోసమే ఈ సినిమా ఒప్పుకున్నా..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 03:38 PM

వారి కోసమే ఈ సినిమా ఒప్పుకున్నా..

ముంబై, జూలై 14 : 'చష్మే బద్దూర్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రముఖ కథానాయిక తాప్సి.. ఆ తర్వాత 'పింక్‌', 'జుడ్వా 2' తదితర చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఈ భామ "ముల్క్‌" అనే చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. రిషి కపూర్, ప్రతీక్‌ బబ్బర్‌ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అనుభవ్‌ సిన్హా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో తాప్సి ఒక ముస్లిం యువతిగా కనిపిస్తుందట. తానూ ఇలా నటించడానికి ఒకరకంగా ముస్లింలే అని చెప్తోంది.

ఈ మేరకు 'ముల్క్‌' ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఈ సినిమా గురించి పలు విషయాలను పేర్కొంది. ఈ సందర్భంగా తాప్సి మాట్లాడతూ.. "ఎక్కడైనా పేలుళ్లు జరిగితే అందుకు కారణం ముస్లింలేనని వారిని విమర్శిస్తుంటారు. అలాంటివి విన్నప్పుడు నాకు చాలా బాధేస్తుంది. ఎక్కడో ముస్లిం మతానికి చెందిన కొందరు ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడితే దానికి అందరిని నిందించడం కరెక్టేనా..! ఇండస్ట్రీలో నాతో కలిసి పనిచేసే వారిలో చాలా మంది ముస్లింలే. అలాగని వారిని కూడా ఉగ్రవాదులతో పోల్చలేం కదా. అందరు ముస్లింలు చెడ్డవారు కాదు. వారికి మద్దతు తెలపడానికే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకొన్నాను" అంటూ చెప్పుకొచ్చారు.





Untitled Document
Advertisements