అనుష్క సినిమాలో నాని అతిథి పాత్ర..!!

     Written by : smtv Desk | Mon, Jul 16, 2018, 04:02 PM

అనుష్క సినిమాలో నాని అతిథి పాత్ర..!!

హైదరాబాద్, జూలై 16 : దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి.. విభిన్నమైన కథాకథనాలతో ప్రేక్షకులను అలరిస్తుంటాడు. త్వరలోనే ఆయన మరో ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక కథను సిద్ధం చేసుకున్నారట. ఈ పాత్ర కోసం ఆయన అనుష్కను సంప్రదించినట్లు సమాచారం. 'భాగమతి' సినిమా తరువాత అనుష్క ఓకే చెప్పిన కథ ఇదే కావడంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

మరో విశేషమేమిటంటే.. ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం నేచురల్ స్టార్ నాని నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కథను నానికి వినిపించడంతో ఆయన ఓకే చెప్పాడట. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇద్దరు స్టార్ యాక్టర్లు ఒక క్రేజీ ప్రాజెక్టులో నటించనుండడంతో ఈ సినిమాపై అంచానాలు భారీగా ఉన్నాయి. అయితే దర్శకుడు ఏలేటి తయారు చేసిన కథ అనుష్క కోసమే అని కొందరు.. కాదు నాని కోసమే అని కొందరు చెప్పుకొంటున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో నాని అతిథి పాత్రలో నటించే అవకాశాలు లేవని.. పూర్తిస్థాయి కథానాయకుడిగానే కనిపించబోతున్నాడని చెబుతున్నారు. మరి నిజానిజాలేంటో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.





Untitled Document
Advertisements