'పరిచయం' సెన్సార్ పూర్తి..

     Written by : smtv Desk | Tue, Jul 17, 2018, 04:17 PM

'పరిచయం' సెన్సార్ పూర్తి..

హైదరాబాద్, జూలై 17 : ఆసిన్ మూవీ క్రియేషన్స్ పతాకంపై లక్ష్మీకాంత్ చెన్నా దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'పరిచయం'. విరాట్ కొండూరు, సిమ్రత్ కౌర్ హీరో హీరోయిన్స్‌గా నటించారు. లక్ష్మీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటుడు పృద్ధ్విరాజ్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు 'యూ/ఏ' సర్టిఫికెట్ జారీ చేశారు.

జూలై 21 ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం గురించి దర్శకుడు లక్ష్మీకాంత్ మాట్లాడుతూ.. ప్రేమకథ చుట్టే తిరిగే సినిమాలు ఎన్నో వచ్చాయి. ఇంకా వస్తూనే ఉంటాయి. ఈ మధ్య వచ్చిన అర్జున్‌ రెడ్డి, ఆర్‌ఎక్స్‌ 100లు కూడా ఇలాంటివే. కాకపోతే కాస్త కొత్తగా తీశారు. అయితే ఈ వారం విడుదలకు సిద్దంగా ‘పరిచయం’ సినిమా కూడా ప్రేమకథే. నిజమైన ప్రేమ అంటే తెలియని వాళ్ళు ఈ చిత్రాన్ని చూడొద్ద౦టూ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements