విజయ్ దేవరకొండ నా..!! మజాకా.!

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 03:00 PM

విజయ్ దేవరకొండ నా..!! మజాకా.!

హైదరాబాద్, జూలై 18 : యంగ్ హీరో విజయ్ దేవరకొండకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ హీరో.. ఇటీవల 'రౌడీ' పేరుతో సొంత అపారెల్ బ్రాండ్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని కోసం 'రౌడీ క్లబ్' పేరుతో ఒక యాప్ కూడా లాంచ్ చేశాడతను. ఇదిలా ఉండగా.. విజయ్ హీరోగా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గీత గోవిందం'. ఈ చిత్రంలోని "ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే... చాలే ఇది చాలే..." అనే ఓ పాటకు సంబంధించిన లిరికల్‌ టీజర్‌ను ఈ నెల 10న యూట్యూబ్‌లో చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ పాట కొద్ది రోజుల్లోనే విశేష ఆదరణను సంపాదించుకుంది.ఇప్పటివరకు కోటి వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈ పాటకు సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ చక్కటి స్వరాలూ సమకూర్చారు. అనంత్‌ శ్రీరామ్‌ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలో ఈ పాటకు ఇంత క్రేజ్‌ లభించింది. ఇదిలా ఉండగా.. 'రౌడీ క్లబ్' యాప్ ను ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా డౌన్ లోడ్ చేసుకున్నారు. ‘రౌడీ’ బ్రాండ్ బట్టల కోసం బుకింగ్స్ చేసుకున్న వాళ్లకు బుధవారం సాయంత్రం 6 గంటలకు ఫస్ట్ డెలివరీ ఇవ్వబోతోంది విజయ్ సంస్థ. విజయ్ కి ఉన్న క్రేజ్ చూసి నెటిజన్లు.. వావ్.. విజయ్ దేవరకొండ నా..!! మజాకా.! అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.





Untitled Document
Advertisements