సమంత 'సీమరాజా' రిలీజ్ డేట్ ఫిక్స్..

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 04:32 PM

సమంత 'సీమరాజా' రిలీజ్ డేట్ ఫిక్స్..

చెన్నై, జూలై 18 : టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లలో ఒకరైన సమంత వరుస సినిమాలతో దూసుకుపోతూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. ఈ అమ్మడు తాజాగా నటించిన 'రంగస్థలం', 'అభిమన్యుడు', 'మహానటి', చిత్రాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత.. తమిళంలో 'సెమ్మ రాజా', 'సూపర్‌ డీలక్స్‌' చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో 'సీమరాజా' ముందుగా ప్రేక్షకులను పలకరించనుంది.

శివకార్తికేయన్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఒక కథానాయికగా సమంత నటిస్తుండగా, మరో కథానాయికగా ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సమంత ఈ సినిమాలో పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని వినాయకచవితి పండగను పురస్కరించుకుని సెప్టెంబర్ 13వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేసే ఆలోచనలో వున్నారు. వీటితోపాటు సామ్ నిన్ను కోరి ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ నటించనుంది.





Untitled Document
Advertisements