'గీత గోవిందం' టీజర్‌ కు డేట్ ఫిక్స్..

     Written by : smtv Desk | Thu, Jul 19, 2018, 03:01 PM

'గీత గోవిందం' టీజర్‌ కు డేట్ ఫిక్స్..

హైదరాబాద్, జూలై 19 : యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'గీత గోవిందం'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతున్న ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ సరసన రష్మిక మందన కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమాలోని 'ఇంకేం ఇంకేం కావాలే' సాంగ్.. అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్‌ సంపాదించింది.

ఇప్పటికే ఈ పాటను 78లక్షల మంది వీక్షించారు.‌ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ చక్కటి స్వరాలూ సమకూర్చిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ అందించిన సాహిత్యం ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్‌ విడుదల తేదీని హీరో విజయ్‌ ప్రకటించారు. ఈ మేరకు తన ట్విట్టర్ లో.. ఈనెల 22న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ ఆసక్తికరమైన పోస్టర్‌ను పంచుకున్నారు. అంతేకాదు 'ఐ లవ్‌ హర్‌ బరువు, బాధ్యత' అని సరదాగా క్యాప్షన్‌ ఇచ్చారు. పోస్టర్‌లో గీతను(రష్మిక) గోవింద్‌(విజయ్ దేవరకొండ)భుజాన మోయడం ఆకట్టుకుంటోంది. కాగా ఈ చిత్ర౦ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Untitled Document
Advertisements