పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సునీత..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 12:10 PM

పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సునీత..

హైదరాబాద్, జూలై 20 : టాలీవుడ్‌లో తన సుమధుర గానంతో అశేష అభిమానులను సంపాదించుకున్నారు సింగర్‌ సునీత.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇప్పటివరకు వందల సినిమాలకు పనిచేశారు. తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిదుడుకుల్ని ఒంటరిగా ఎదుర్కొన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఆమెకు సంబంధించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. త్వరలోనే సునీత మరో పెళ్లి చేసుకోనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆమెపై వస్తున్న వార్తలపై స్పందిస్తూ.. సునీత ఒక వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు.

"నాకు వరుసగా ఫోన్ కాల్స్.. మెసేజ్ లు వస్తున్నాయి. 'మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారా.? అడుగుతున్నారు. చాలా వెబ్ సైట్స్ ఈ విషయ౦ గురించి రాసుకొచ్చాయి.. నా మీద ఇంత ఎఫెక్షన్ ఉందా అనిపించింది. నిజం చెప్పాలంటే మళ్లీ పెళ్లి అనే ఆలోచనే నాకు లేదు. నేను ఒక మాట అంటే అది వేరే విధంగా జనంలోకి వెళ్లకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇది నా పర్సనల్ విషయం. నేను చెబితేనే అది నిజమని భావించాలి. అప్పటి వరకూ వచ్చే పుకార్లను నమ్మవద్దు" అంటూ స్పష్టం చేశారు.
https://www.facebook.com/singer.sunitha/videos/1134276413388032/

Untitled Document
Advertisements