సోదరి ఫంక్షన్ కు మెగా పవర్ స్టార్..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 01:08 PM

సోదరి ఫంక్షన్ కు మెగా పవర్ స్టార్..

హైదరాబాద్, జూలై 20 : సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంట‌గా యువీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో 'హ్యాపి వెడ్డింగ్' చిత్రం తెరకెక్కుతుంది. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్, సున్నిత‌మైన స‌న్నివేశాలు, చిలిపిగా సాగే క‌థ‌నంతో ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ తెర‌కెక్కించిన ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరపనున్నారు. ఈ నేపథ్యంలో రేపు జరపనున్న ఈ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ హాజరుకానున్నాడు.

ఈ మేరకు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ను సైతం రిలీజ్ చేశారు. అయితే ఈ చిత్రానికి ఫిదా ఫేం శక్తికాంత్‌ సంగీతమందిస్తు౦డగా.. తమన్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక అమ్మాయికి, అబ్బాయికి పెళ్లి కుదరడం దగ్గర నుంచి పెళ్లి జరిగేంత వరకు మధ్యలో ఏం జరిగింది, వారి మధ్య చోటుచేసుకున్న సంఘటనలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సున్నితమైన సన్నివేశాలతో తెరకెక్కిన ఈ చిత్రం పట్ల ప్రేక్షకులు ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈనెల 28వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Untitled Document
Advertisements