జాన్వి, ఇషాన్‌ల నటన అద్భుతం..

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 03:46 PM

జాన్వి, ఇషాన్‌ల నటన అద్భుతం..

ముంబై, జూలై 20 : అలనాటి మేటి తార శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌ 'ధడక్' చిత్రంతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఇషాన్‌ ఖత్తర్‌ కథానాయకుడిగా.. శశాంత్‌ ఖైతాన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని కరణ్‌ జోహార్‌ నిర్మిస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా చూసిన ఎందరో సినీ ప్రముఖులు జాన్విపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు ట్విట్టర్ లో జాన్విని చూసి నోట మాటరాలేదంటూ తమ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

* శశాంక్‌ ఖైతాన్‌ చాలా బాగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఇషాన్‌.. నీ సింప్లిసిటీతో అదరగొట్టేశావ్‌. జాన్వి.. నిన్ను చూశాక నోటమాటరాలేదు. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. -అర్జున్‌ కపూర్‌

* 'ధడక్‌' చాలా అందమైన సినిమా. జాన్వి, ఇషాన్‌ మీ నటనతో అందరినీ మెప్పిస్తారన్న నమ్మకం నాకుంది. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు -మాధురి దీక్షిత్‌

* 'ధడక్‌' సినిమా చూశాక నా మ‌న‌సు ఎమోష‌న్‌తో నిండిపోయింది. జాన్వి, ఇషాన్ చిన్న త‌ప్పు కూడా చేయ‌లేదు. ఎంతో అనుభ‌వ‌మున్న‌వారిలా న‌టించారు -నేహా ధుపియా

* శశాంక్ ఖైతాన్‌ అద్భుతంగా చిత్రాన్ని రూపొందించారు. ఇషాన్‌, జాన్వి సినిమాలో చాలా బాగా నటించారు. సమాజానికి మంచి సందేశాన్నిచ్చారు. మీరు సినిమా చూడండి. -వరుణ్‌ ధావన్‌

* ఇషాన్‌, జాన్వి ఎప్పుడో స్టార్స్‌ అయిపోయారు. సినిమాలో వారి అందమైన ప్రేమకథ, అమాయకత్వం ప్రతి ఒక్కరి మనసులను హత్తుకుంటుంది. -అనిల్‌ కపూర్‌

Untitled Document
Advertisements