మెగా హీరోల డబుల్ ధమాకా..!!

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 06:27 PM

మెగా హీరోల డబుల్ ధమాకా..!!

హైదరాబాద్, జూలై 20 : మెగాస్టార్ పుట్టిన రోజంటే మెగా అభిమానులకు పండగే. ఆ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి మెగాస్టార్ పై తమ అభిమానాన్ని చాటుకుంటారు. ఈ సారి మెగా హీరోలు అభిమానులకు డబుల్ ధమాకా దక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే చిరంజీవి తాజాగా తెలుగు స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రానికి సంబంధించి ఆగస్టు 22.. మెగాస్టార్ పుట్టిన రోజున 'సైరా' టీజర్, లేదా ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా.. చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా అభిమానులకు గిఫ్ట్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం చెర్రి బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ సైతం రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

కాగా చరణ్ యాక్షన్ ఎంటర్టైనర్ కి ఇంతవరకూ టైటిల్ ను ఖరారు చేయలేదు. చిరంజీవి పుట్టినరోజున టైటిల్ తో కూడిన ఫస్టులుక్ ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తోందట. ఇలా ఒకే రోజున తండ్రి తనయుల సినిమాల నుంచి ఫస్టులుక్స్ రానుండడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. మెగాస్టార్ నటిస్తున్న 'సైరా' చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించగా.. రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Untitled Document
Advertisements