పేపర్ బాయ్ మూవీ టీజర్

     Written by : smtv Desk | Sat, Jul 21, 2018, 02:02 PM

పేపర్ బాయ్ మూవీ టీజర్

రామ్‌చరణ్‌, రవితేజ, గోపిచంద్ లాంటి హీరోలతో మాస్‌ కమర్షియల్ ఎంటర్‌టైనర్లను తెరకెక్కించిన సంపత్‌ తన స్వీయ నిర్మాణంలో సినిమాలు రూపొందిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ యువ ద‌ర్శ‌కుడు ‘పేప‌ర్ బాయ్’ పేరుతో ఓ సినిమాని నిర్మిస్తున్నారు. సంతోష్ శోభ‌న్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో రియా సుమ‌న్‌, తాన్యా హోప్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీత‌మందిస్తున్నారు.టీమ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో రెండో ప్రయత్నంగా తెరకెక్కిన పేపర్ బాయ్ సినిమా టీజర్‌ విడుదలైంది. టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దర్శకుడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ ప్రేమకథగా ప్రతి ప్రేముని అందంగా మలచినట్లు టీజర్ ద్వారా స్పష్టం అవుతోంది. సంతోష్ శోభన్ న్యూస్ పేపర్లు వేసే పేపర్ బాయ్ గా నటిస్తున్నాడు.

తాను పేపర్ వేసే ఓ ఇంట్లో అమ్మాయిని చూసి ప్రేమించే కథగా ఈ చిత్రం రానుంది. రియా సుమన్ టీజర్ లో చాలా అందంగా కనిపిస్తోంది. బిటెక్ చదివి పేపర్స్ వేస్తున్నావా.. అది బ్రతకడానికి, ఇది భవిష్యత్తు కోసం అంటూ హీరో హీరోయిన్ మధ్య సాంగ్ సంభాషణ బావుంది. మొత్తంగా పేపర్ బాయ్ టీజర్ చిత్రంపై అంచనాలు పెంచే విధంగా ఉందని చెప్పొచ్చు.

ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ మూవీ ఆడియో, సినిమా రిలీజ్‌ డేట్లు త్వరలోనే వెల్లడించనున్నారు. త్వరలో సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు.

Untitled Document
Advertisements