చరిత్ర సృష్టించిన పాక్‌ బౌలర్‌

     Written by : smtv Desk | Mon, Aug 27, 2018, 11:06 AM

చరిత్ర సృష్టించిన పాక్‌ బౌలర్‌

టీ20 క్రికెట్‌లో అద్భుతం చోటుచేసుకుంది. పాకిస్తాన్ పేస్‌బౌలర్ మహమ్మద్ ఇర్ఫాన్ అరుదైన రికార్డు నమోదు చేశాడు.కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బార్బడోస్ ట్రైడెంట్, సెయింట్ కిట్స్ అండ్‌ నేవిస్‌ పాట్రియాట్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇర్ఫాన్ అత్యంత అరుదైన రికార్డు సృష్టించాడు. బార్బడోస్ జట్టు తరపున ఆడుతున్న ఇర్ఫాన్ ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్ వెన్నులో వణుకు పుట్టించాడు.

నాలుగు ఓవర్లు వేసిన ఇర్ఫాన్ వరుసగా 23 బంతులను డాట్ బాల్స్ వేశాడు. చివరి బంతికి మాత్రం ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. ఓపెనర్లు క్రిస్‌ గేల్‌, ఇవిన్‌ లెవిస్‌ వికెట్లను పడగొట్టాడు. చివరి బంతికి కనుక పరుగు ఇవ్వకుంటే వేసిన నాలుగు ఓవర్లూ మెయిడెన్లుగా మరో రికార్డు అతడి పేరును నమోదై ఉండేది. అయితే ఇర్ఫాన్ ఇంత అద్భుతమైన బౌలింగ్ చేసినా.. తన టీమ్ బార్బడోస్ ట్రైడెంట్స్‌ను ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో బార్బడోస్ ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రైడెంట్స్.. 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. కెప్టెన్ జేస్ హోల్డర్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత చేజింగ్ మొదలుపెట్టిన సెయింట్ కిట్స్.. 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది.





Untitled Document
Advertisements