చంద్రబాబు ఒక కార్మిక ద్రోహి.... : వైసిపీ ఎమ్మెల్యే రోజా

     Written by : smtv Desk | Tue, Aug 28, 2018, 06:44 PM

చంద్రబాబు ఒక  కార్మిక ద్రోహి.... : వైసిపీ ఎమ్మెల్యే రోజా

నేడు తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ..చంద్రబాబు చేస్తాన్నాన్న 'రైతు రుణమాఫీ' ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్కరికీ కాలేదని వెల్లడించారు.అయితే కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలబీడుకు చెందిన రామయ్య దంపతులు రైతు రుణమాఫీ కాలేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనను ఉద్దేశిస్తూ రైతు రుణమాఫీ కాక పోవడంతో రామయ్య దంపతులు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆమె చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించారు .

ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధపు హామీలను ఇచ్చారని, చంద్రబాబు పాలనలో చిత్తూరు, రేణిగుంట ఫ్యాక్టరీ, 'విజయ' పాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయిని రోజా తెలిపారు . తిరుపతి ఆర్టీసీ గ్యారేజీని ఇతర జిల్లాలకు తరలించే యత్నం జరుగుతోందని, చంద్రబాబు ఒక కార్మిక ద్రోహి అని చంద్రబాబు పై మండిపడ్డారు. ఈ గ్యారేజీ కార్మికులకు వైసీపీ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఆమె తెలిపారు.

Untitled Document
Advertisements