ఆసియా క్రీడల్లో మరో సంచలనం....

     Written by : smtv Desk | Wed, Aug 29, 2018, 07:07 PM

ఆసియా క్రీడల్లో మరో సంచలనం....

జకార్తా: బుధవారం జరిగిన మహిళల 200 మీటర్ల పరుగులో ద్వితీయ స్థానంలో పరుగుల రాణి ద్యుతీచంద్‌ ఆసియా క్రీడల్లో మరో సంచలన ప్రదర్శనగా నిలిచింది. ఆసియా క్రీడల్లో ఒకటి కన్నా ఎక్కువ పతకాలు సాధించిన పీటీ ఉష, జ్యోతిర్మయి వంటి దిగ్గజ అథ్లెట్ల సరసన నిలిచింది.భారత్‌కు వ్యక్తిగతంగా రెండో రజతం అందించింది.
తొలుత 100 మీటర్ల పరుగులో రజతం గెలిచిన ద్యుతీ 200 మీటర్ల పరుగులో తన సత్తా చూపింకుంది. 23.20 సెకన్లలో గమ్యాన్ని చేరింది. బహ్రెయిన్‌కు చెందిన ఎడిడియాంగ్‌ ఓడియాంగ్‌ 22.96 టైమింగ్‌తో స్వర్ణం ఎగరేసుకుపోయింది. పురుష హార్మన్లు (హపర్‌యాండ్రోజెనిసమ్‌) అధికంగా ఉన్నాయంటూ ఆమెను 2014లో ఆసియా క్రీడల్లో పోటీపడనివ్వలేదు. స్పోర్ట్స్‌ ఆర్బిట్రేజ్‌ కోర్టులో పోరాడిన ద్యుతీ తిరిగి కఠోర సాధన చేసింది. అకుంఠిత దీక్షతో అందరినీ మెప్పించింది.

1986లో సియోల్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో పీటీ ఉష 200 మీటర్లు, 400 మీటర్లు, 400 మీటర్ల హర్డిల్స్‌, 4×400 మీటర్ల రిలేలో స్వర్ణాలు గెలిచి రికార్డు సృష్టించింది. 1998 బ్యాంకాక్‌ క్రీడల్లో జ్యోతిర్మయి సిక్దార్‌ 800 మీటర్లు, 1500 మీటర్లలో రెండు పతకాలు సాధించింది. 2002 బుసాన్‌ క్రీడల్లో సునితా రాణి 1500 మీటర్లు, 500 మీటర్లలో రెండు పతకాలతో ఇటువంటి ప్రదర్శన తో మేరువగా ఆదే కోవ తిరిగి ద్యుతీచందు పదర్శన చూపడం గమనార్హం

Untitled Document
Advertisements