క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్ గుడ్ బై

     Written by : smtv Desk | Mon, Sep 03, 2018, 05:40 PM

క్రికెట్‌కు ఇంగ్లాండ్ క్రికెటర్  గుడ్ బై

అంతర్జాతీయ క్రికెట్ కు అలిస్టర్ కుక్ వీడ్కోలు పలకనున్నారు. ఈనెల 7వతేదీన భారత్ తో జరుగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్ అనంతరం కుక్ వీడ్కోలు చెప్పనున్నారు. 33 ఏళ్ల కుక్ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన వాళ్లలో ఆరోస్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 160 టెస్టులు ఆడిన కుక్.. 12254 పరుగులు చేశాడు. అతని సగటు 44.88. ఇంగ్లండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ అతడే. ఒకదశలో సచిన్ రికార్డులు బద్ధలు కొడతాడని అందరూ భావించినా.. కొంతకాలంగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్నాడు.

అత్యంత పిన్న వయస్సులో టెస్టుల్లో పదివేల పరుగుల మైలురాయిని దాటిన ఆటగాడిగా కుక్ సచిన్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టాడు. సచిన్ 31 ఏళ్ల 326 రోజుల వద్ద ఈ మైలురాయిని బద్ధలు కొడితే.. కుక్ 31 సంవత్సరాల 157 రోజుల్లోనే ఈ ఘనతను సాధించాడు.

Untitled Document
Advertisements