హైకోర్టు: ఇక దళితులు అనే పదం వాడొద్దు

     Written by : smtv Desk | Tue, Sep 04, 2018, 02:04 PM

హైకోర్టు: ఇక దళితులు అనే పదం వాడొద్దు

* ప్రైవేటు టీవీ ఛానెల్స్‌కు ప్రభుత్వం మార్గదర్శకాలు

దిల్లీ: షెడ్యూల్‌ కులాలకు చెందిన ప్రజలను ‘దళితులు’ అని పిలవొద్దని, వారి గురించి ప్రస్తావించేప్పుడు దళితులు అనే పదం ఉపయోగించొద్దని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రైవేటు టీవీ ఛానల్స్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ మార్గదర్శకాలు ఇచ్చింది. షెడ్యూల్‌ కులాల ప్రజలను దళితులు అని పిలవొద్దని, ఆ పదం ఉపయోగించడాన్ని ఆపాలని మీడియాకు సూచించమని ఈ ఏడాది జూన్‌లో బాంబే హైకోర్టు సమాచార మంత్రిత్వ శాఖను అడిగింది. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఇటీవల మీడియాకు మార్గదర్శకాలు పంపించింది.

దళితులు అనే పదం వాడడాన్ని వ్యతిరేకిస్తూ పంకజ్‌ మేశ్రమ్‌ అనే వ్యక్తి బాంబే హైకోర్టులోని నాగ్‌పూర్‌ బెంచ్‌లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ పదం వాడకుండా ఆపాలని సమాచార మంత్రిత్వ శాఖను ఆదేశించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. బాంబే హైకోర్టు ఆదేశాల మేరకు ‘షెడ్యూల్‌ కులాల’ ప్రజలను దళితులు అని పిలవొద్దని, ఆంగ్లంలో ‘షెడ్యూల్‌ క్యాస్ట్‌’ అనే పదానికి స్థానిక భాషల్లో తగిన అనువాద పదం ఉపయోగించాలని స్పష్టంచేసింది.





Untitled Document
Advertisements