చిరాకుపడిన రవిశాస్త్రి.

     Written by : smtv Desk | Tue, Sep 04, 2018, 04:51 PM

చిరాకుపడిన రవిశాస్త్రి.

టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌లు గత కొంతకాలం నుంచి రహస్యంగా డేటింగ్‌ చేస్తున్నారని వార్తలు హల్‌చల్‌ చేశాయి. వీరిద్ద‌రూ రెండేళ్లుగా డేటింగ్ చేస్తున్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నార‌ని క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. ఈ వార్త‌ల గురించి ర‌విశాస్త్రి, నిమ్ర‌త్ కౌర్ స్పందించారు. అవ‌న్నీ అవాస్త‌వాలేన‌ని ఇద్ద‌రూ కొట్టిపారేశారు.

నిమ్రత్‌తో డేటింగ్ వ్యవహారంపై రవిశాస్త్రి ప్రముఖ దినపత్రికతో మాట్లాడుతూ.. నాపై వస్తున్న రూమర్‌పై మాట్లాడానికి ఏమీ లేదు. నాపై రాసిన వార్త ఓ భారీ పేడకుప్ప, చెత్త లాంటింది అని సీరియస్ అయ్యారు. అయితే పదేపదే ఈ విషయంపై సమాచారం రాబట్టడానికి ప్రయత్నం చేయగా.. చెప్పనుగా.. అది ఓ చెత్త వార్త అని రవిశాస్త్రి దురుసుగా సమాధానం ఇచ్చారు.

Untitled Document
Advertisements