షియోమీ రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు విడుదల

     Written by : smtv Desk | Wed, Sep 05, 2018, 03:09 PM

 షియోమీ రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు  విడుదల

చైనాకు చెందిన మొబైల్స్ త‌యారీదారు షియోమీ సంస్థ నుండి మూడు స్మార్ట్ ఫోన్ లు భారత మార్కెట్లో తాజాగా విడుదల అయ్యాయి. గతంలో చైనాలో విడుదల చేసిన సిరీస్ ప్రకారంగానే భారత్ లో కూడా రెడ్ మీ 6, 6 ప్రో, 6ఏ పేరిట నూతన స్మార్ట్ ఫోన్ లని తాజాగా విడుదల చేసింది. రెడ్‌మీ 6 ఈనెల 10న, రెడ్‌మీ 6ప్రో ఈనెల 11న, రెడ్‌మీ 6ఎ ఈనెల 19న విక్రయానికి అందుబాటులోకి రానున్నాయి. వీటి ధరలు, ప్రత్యేకతలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

రెడ్‌మీ 6ఎ ధరలు:

2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్: రూ.5999
2 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.6999

రెడ్‌మీ 6 ధరలు:

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.7999
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.9499

రెడ్‌మీ 6 ప్రో ధరలు:

3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్: రూ.10999
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్: రూ.12999

షియోమీ రెడ్‌మీ 6ఎ ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో ఏ 22 ప్రాసెసర్
5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
2 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

షియోమీ రెడ్‌మీ 6 ఫీచర్లు:

ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, హీలియో పీ 22 ప్రాసెసర్
5.45" హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
3 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ (256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
ఫింగర్‌ప్రింట్ సెన్సార్,ఫేస్ అన్ లాక్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ.

షియోమీ రెడ్‌మీ 6 ప్రో ఫీచర్లు:

2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
5.84" ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే
స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్ ( 256 జీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
12/5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ

Untitled Document
Advertisements