ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

     Written by : smtv Desk | Thu, Sep 06, 2018, 11:44 AM

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

* గొడుగులతో వచ్చి బీజేపీ ఎమ్మెల్యేల నిరసన

* 19వ తేదీ వరకు కొనసాగనున్న సమావేశాలు

అమరావతి : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. ఈ నెల 19 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఏడు పని దినాల పాటు సభను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గొడుగులు, రెయిన్ కోట్లతో వచ్చారు. చిన్నపాటి వర్షాలకే అసెంబ్లీలోకి నీళ్లు వచ్చేస్తున్నాయంటూ నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ మొత్తం లీకులమయమైందని... వేయి కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమయిందని వారు ఆరోపించారు. వర్షాకాల సమావేశాలు కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా గొడుగులు, రెయిన్ కోట్లతో అసెంబ్లీకి వచ్చామని బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు.
అంతకు ముందు స్పీకర్ కోడెల శివప్రసాద్ అధ్యక్షతన బీఏసీ సమావేశం జరుగగా... సమావేశానికి మంత్రులు యనమల, కాల్వ శ్రీనివాసులు, విప్ కూన రవికుమార్, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజులు హాజరయ్యారు.





Untitled Document
Advertisements