నోటా ట్రైలర్: 54 లక్షల వ్యూస్

     Written by : smtv Desk | Fri, Sep 07, 2018, 08:18 PM

నోటా ట్రైలర్: 54 లక్షల వ్యూస్

హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ తో సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాడు విజయ్ దేవరకొండ. ముఖ్యమంత్రి పాత్రలోసరికొత్త గెటప్ లో విజయ్ కనిపించబోతున్నాడు.

అయితే ఈ ట్రైలర్ విడుదలైన కొద్ది గంటల్లో మిలియన్ వ్యూస్ ని సాధించిన ఈ ట్రైలర్ ఇప్పటివరకు 54 లక్షల వ్యూస్ ని రాబట్టింది. దీన్ని బట్టి విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతోంది. 5 మిలియన్ వ్యూస్ ని సాధించిన సందర్భంగా విజయ్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ''రెండు రాష్ట్రాలకి ఒక్క రౌడీ. పొలిటీషియన్. లీడర్. ది దేవరకొండ'' అంటూ ట్వీట్ చేశాడు.

Untitled Document
Advertisements