మోడీ పై మండిపడ్డ నారా లోకేష్

     Written by : smtv Desk | Sat, Sep 08, 2018, 11:25 AM

మోడీ పై మండిపడ్డ నారా లోకేష్

అమరావతి: కేసీఆర్ కొడుకు కేటీఆర్ కు అడాగ్గానే అపాయింట్ మెంట్ ఇచ్చిన మోడీ చంద్రబాబు ఎన్నిసార్లు అడిగిన అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నారు. ఎన్నికలకు ముందే తెరాసతో బీజీపీ పొత్తు పెట్టుకుందని విమర్శించారు. కష్టాల్లో ఉన్న ఏపీని పట్టించుకోని మోదీ... కేసీఆర్ కోరికలన్నింటికీ ఆమోదముద్ర వేశారని అన్నారు. అక్రమ సంబంధానికి గోత్రాలతో సంబంధం ఏముంటుందని ఎద్దేవా చేశారు.
అవినీతిపరుడు జగన్ కు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తోందని లోకేష్ మండిపడ్డారు. అవినీతిపరుల ఆస్తులను జప్తు చేసే బిల్లును కేంద్రానికి పంపితే... ఇంతవరకు ఆమోదముద్ర వేయలేదని విమర్శించారు. జగన్ ను కాపాడేందుకే ఈ బిల్లును పక్కన పెట్టారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ కు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. అవినీతి పరులకు ఓటేస్తే మరింతగా ప్రజాల సొమ్మును దోచుకుంటారని అన్నారు.

Untitled Document
Advertisements