‘యు ట‌ర్న్’ సెన్సార్ రిపోర్ట్

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 04:04 PM

‘యు ట‌ర్న్’ సెన్సార్  రిపోర్ట్

అందాల భామ సమంత ప్రదానపాత్రలో నటించిన చిత్రం యు ట‌ర్న్. ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి ‘U/A’ స‌ర్టిఫికేట్ ఇచ్చారు.

రాహుల్ ర‌వీంద్ర‌న్ ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో భూమికా చావ్లా ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. పూర్ణ‌చంద్ర తేజ‌స్వి ఈ చిత్రానికి సంగీతం అందించారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్ర‌ఫీ సినిమాకు హైలైట్ కానుంది. శ్రీ‌నివాస సిల్వ‌ర్ స్క్రీన్ మ‌రియు వివై కంబైన్స్ బ్యాన‌ర్స్ పై శ్రీ‌నివాస చిట్టూరి, రాంబాబు బండారు యు ట‌ర్న్ చిత్రాన్ని నిర్మించారు.

సెప్టెంబ‌ర్ 13న సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. ప‌వ‌న్ కుమార్ ఈ చిత్రాన్ని మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కించాడు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ మ‌రియు ప్ర‌మోష‌న‌ల్ వీడియోకు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది.

Untitled Document
Advertisements