కూకట్ పల్లి అభ్యర్థిని మార్చాలి.

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 12:48 PM

కూకట్ పల్లి అభ్యర్థిని మార్చాలి.

తెరాస నాయకులు డిమాండ్.

హైదరాబాద్: ఉద్యమంలో పాల్గొన్న నాయకులకు టికెట్ ఇవ్వాలంటూ కూకట్ పల్లి తెరాస నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మాధవరం కృష్ణారావు కు టికెట్ఇవ్వడాన్ని నిరసిస్తూ అయన చిత్రపటాన్ని దహనం చేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉద్యమకారులు ఉద్యమిస్తేనే తెలంగాణ వచ్చి కేసీఆర్‌ సీఎం అయ్యారని, కానీ నేడు వారిని పట్టించుకోవడం లేదన్నారు. ఉద్యమంలో కడుపు మాడ్చుకుని, రోడ్ల మీద్ద కూర్చున్నామని, అరెస్టులతో జైలుపాలయ్యమన్నారు. రెండో సారి ఎన్నికల్లో ఉద్యమకారులకు కాకుండా ఉద్యమాన్ని అపహాస్యం చేసిన వ్యక్తులకు టీడీపీ, కాంగ్రెస్‌ నుంచి వచ్చిన వారికి టికెట్లు, పదవులు ఇవ్వడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కూకట్‌పల్లి అభ్యర్థిని మార్చకుంటే కేసీఆర్‌ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. మాధవరానికే బీఫాం ఇస్తే డిపాజిట్లు రాకుండా చూస్తామన్నారు.
స్వతంత్య్ర అభ్యర్థిగా ఉద్యమకారులు నిలబడితే గెలుపుకు కృషి చేయడమే కాకుండా రూ. 5లక్షలు ఇస్తానని టీఆర్‌ఎస్‌ నేత విజయ్‌కుమార్‌ ప్రకటించారు.
తెలంగాణ వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇలాంటి ప్రభావమే ఉంది. కొన్ని చోట్ల దిష్టిబొమ్మలను దహనం చేస్తుంటే, మరికొన్ని చోట్ల తమ నాయకులకే టికెట్ ఇవ్వాలంటూ టవర్లు ఎక్కి నిరసన వక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements