ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన బీసీలకు అన్యాయం జరుగుతుంది: ఆర్ కృష్ణయ్య

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 03:12 PM

ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన బీసీలకు అన్యాయం జరుగుతుంది: ఆర్ కృష్ణయ్య

హైదరాబాద్: ఎన్ని పార్టీలు పుట్టుకొచ్చిన బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీల జనాభా లెక్కల ప్రకారం చట్ట సభల్లో సీట్లు కేటాయించాలని డిమాండ్ చేసారు. ఈ సారి రాజకీయ పార్టీలు బీసీలను విస్మరిస్తే భౌతిక దాడులు చేస్తామని హెచ్చరించారు.

హైదరాబాద్‌ అబిడ్స్‌లోని సిద్ధార్థ హోటల్‌లో 112 బీసీ కుల సంఘాలతో సమావేశమైన కృష్ణయ్య... ఈ సందర్భంగా ఎన్టీవీతో మాట్లాడుతూ... రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా దామాషా ప్రకారమే టిక్కెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ - టీడీపీ పొత్తులపై మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన... తాను ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

టి.టీడీపీ ముఖ్య నేతల సమావేశానికి సంబంధించి పార్టీ నేతల నుంచి నాకు సమాచారం రాలేదన్న కృష్ణయ్య... కొత్త పార్టీ పెట్టే విషయంపై కొద్ది రోజుల్లో స్పష్టత ఇస్తానని తెలిపారు. దేశానికి స్వతంత్రం వచ్చినప్పటినుండి బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని ఇప్పటికైనా బీసీ కులాలు ఒక్కటి కావాల్సిన అవసరం ఉందని అన్నారు





Untitled Document
Advertisements