జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన

     Written by : smtv Desk | Mon, Sep 10, 2018, 06:53 PM

జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన

హైదరాబాద్: ఎట్టకేలకు శిక్ష ఖరారైంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గోకుల్‌చాట్‌, లుంబినీ పార్కు జంట పేలుళ్ల కేసులో ఎన్‌ఐఏ కోర్టు తుదితీర్పును వెలువరించింది.. ఈ కేసుల్లో దోషులిద్దరు అనీఖ్ షరీఫ్, అక్బర్ ఇస్మాయిల్‌కు ఎన్‌ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తారిఖ్ అంజూమ్ కు కోర్టు జీవితఖైదు విధించింది.

ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్‌ రజాఖాన్, రియాజ్‌ భత్కల్, ఇక్బాల్‌ భత్కల్‌ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్‌ షఫీఖ్‌ సయీద్, సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖా ష్, అక్బర్‌ ఇస్మాయిల్‌ చౌదరి, మహ్మద్‌ తారీఖ్‌ అంజుమ్‌ ఎహసాన్‌)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్‌ ఇష్రార్‌ షేక్, ఫారూఖ్‌ సర్ఫుద్దీన్‌ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు.





Untitled Document
Advertisements