15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలి

     Written by : smtv Desk | Wed, Sep 12, 2018, 01:13 PM

15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలి

* రేవంత్ రెడ్డి కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కి జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేసారు. నకిలీ పత్రాల సాయంతో పాస్‌పోర్టు, వీసా పొందడంతో పాటు మనుషుల అక్రమ రవాణా కేసుల్లో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కేసు మరవకముందే మరో కాంగ్రెసునేతకు నోటీసులు జారీ చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశమవుతోంది.

జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ 2001 సంవత్సరంలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తప్పుడు పత్రాలతో ఇళ్ల స్థలాల కేటాయించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు సంబంధించి 15 రోజుల్లోగా విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆ నోటీసులలో రేవంత్ రెడ్డికి సూచించారు.

Untitled Document
Advertisements