ఆ రెండు సినిమాలు నాకు చేదు జ్ఞాపకాలు....నాగ చైతన్య !

     Written by : smtv Desk | Fri, Sep 14, 2018, 04:19 PM

 ఆ రెండు సినిమాలు నాకు చేదు జ్ఞాపకాలు....నాగ చైతన్య !

వినాయక చవితి సందర్బంగా శైలజారెడ్డి అల్లుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాగ చైతన్య పాజిటివ్ టాక్ ను అందుకున్నాడు, మారుతీ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో అను ఇమ్మానుయేల్ కథానాయికగా నటించగా రమ్యకృష్ణ నాగచైతన్యకు అత్తగా పవర్ ఫుల్ పాత్రలో నటించింది.
ఈ నేపథ్యంలో తన కెరీర్ గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు చైతు "కెరీర్ తొలి నాళ్లలో కథల ఎంపికలో కొన్ని తప్పులు చేశాను అందులో భాగంగా చేసినవే దడ , బెజవాడ సినిమాలు, అవి నా కెరీర్ లో చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అందుకు నేను ఎవరిని బాధ్యులను చేయడం లేదు. ఎలాంటి సినిమాలు ఎంచుకోవాలి అనే విషయం లో కొంత పరిణితి సాధించాను ,అయితే నాకు బాగా సంతృప్తి ఇచ్చిన సినిమా మాత్రం 'ప్రేమమ్' ,ఆ సినిమాని చాలా ఇష్టపడి చేశాను. మొదట్లో కొంతమంది ఈ సినిమా చేయొద్దని వర్కౌట్ కాదు అని సలహా ఇచ్చారు అయినా నాకు ఎందుకో ప్రేమమ్ చేయాలనిపించింది" అని తెలిపారు.

Untitled Document
Advertisements