బంగ్లాదేశ్ అదరగొట్టింది

     Written by : smtv Desk | Sun, Sep 16, 2018, 01:13 PM

బంగ్లాదేశ్ అదరగొట్టింది

ఆసియాకప్ ప్రారంభ మ్యాచ్‌లోనే బంగ్లాదేశ్ అదరగొట్టింది. ఒక్క పరుగుకే రెండు వికెట్లు పడిపోయిన దశ నుంచి కోలుకుని ఒక్కో పరుగు జోడిస్తూ అద్భుత ఇన్నింగ్స్ ఆవిష్కరించారు బంగ్లా బ్యాట్స్‌మెన్. పెద్దగా కష్టం కాని లక్ష్యాన్ని కాపాడుకుంటూ ఇంకా అద్భుతంగా వికెట్లు తీశారు బౌలర్లు. ఫలితం ఆసియాకప్‌ను ఐదుసార్లు అందుకున్న శ్రీలంకపై 137 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 49.3 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంక 35.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. ఓ వైపు వికెట్లు పడుతున్నా ధాటిగా బ్యాటింగ్ చేసిన ముష్ఫికర్ రహీమ్ 150 బంతుల్లో 11 ఫోర్లు 4 సిక్సర్లతో 144 పరుగులు చేసిన తర్వాత పెరారా బౌలింగ్‌లో చివరి వికెట్‌గా అవుటయ్యాడు

దిల్‌రువాన్‌ పెరెరా(29), తరంగ (27) మినహా మరెవరూ రాణించకపోవడంతో 35.1 ఓవర్లలో 124 పరుగులకే శ్రీలంక జట్టు ఆలౌటైంది. లంక బ్యాట్స్‌మెన్లలో ఉపుల్‌ తరంగ (27), పెరీరా(29), లక్మల్‌(20), మథ్యూస్‌(16), కుశాల్‌ పెరీరా(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. శ్రీలంక బౌలర్లలో లసిత్ మలింగ 4 వికెట్లతో రాణించాడు.

Untitled Document
Advertisements