బిగ్ బాస్: అమిత్ తివారి ఎలిమినేట్

     Written by : smtv Desk | Mon, Sep 17, 2018, 12:54 PM

 బిగ్ బాస్: అమిత్ తివారి ఎలిమినేట్

నాని హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సెకండ్ సీజన్ మరో రెండు వారాల్లో ముగియనుంది. 16 మంది కంటెస్టంట్స్ తో మొదలైన బిగ్ బాస్-2లో ప్రస్తుతం హౌజ్ లో 6మంది మాత్రమే మిగిలి ఉన్నారు. ఆదివారం ఎపిసోడ్ లో అమిత్ తివారి ఎలిమినేట్ అవడం జరిగింది. స్టేజ్ మీదకు నానితో పాటుగా అమిత్ బిగ్ బాస్-2 టాప్ 3 ఎవరన్నది చెప్పాడు. టాప్ లో సామ్రాట్, గీతా, రోల్ రైడా ఉంటారని చెప్పాడు.

కౌశల్ పై శనివారం తీవ్రంగా మండిపడ్డాడు నాని. రోల్ రైడాతో కౌశల్ అన్న ఓ బూతు మాట గురించి ప్రస్థావించి కౌశల్ ను నాని టార్గెట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫన్నీ టాస్క్ లో కూడా అందరు కౌశల్ మీద తమ ఒపీనియన్ చెప్పేశారు. ఇదిలాఉంటే ఫైనల్ లో కౌశల్ ఉంటాడా ఉండడా అన్న టాక్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. కౌశల్ ఆర్మీ కౌశల్ కు సపోర్ట్ గా నిలుస్తున్నా ఇంటి సభ్యులంతా కౌశల్ మీద నెగటివ్ ఇంప్రెషన్ తో ఉన్నారు. మరి వారందరిని కాదని కౌశల్ కు టైటిల్ ఇస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.





Untitled Document
Advertisements