ఆసియాకప్‌: టాస్‌ గెలిచిన పాక్‌

     Written by : smtv Desk | Wed, Sep 19, 2018, 05:57 PM

ఆసియాకప్‌: టాస్‌ గెలిచిన పాక్‌

ఆసియాకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన పాక్‌ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ ఖాన్‌ బ్యాటింగ్‌కే మొగ్గు చూపాడు. ఇక భారత జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. ఖలీల్‌ అహ్మద్‌, శార్ధుల్‌ టాకుర్‌ స్థానాల్లో జస్‌ప్రీత్‌ బుమ్రా, హార్ధిక్‌ పాండ్యాలు జట్టులోకి వచ్చారు. పాక్‌ ఎలాంటి మార్పుల్లేకుండా హాంకాంగ్‌తో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతోంది.

భారత్‌: రోహిత్‌ (కెప్టెన్‌), ధావన్‌, రాయుడు, ధోని, కార్తిక్‌, జాదవ్‌, పాండ్యా, భువనేశ్వర్‌,బుమ్రా, చహల్‌, కుల్‌దీప్‌

పాకిస్తాన్‌: ఇమామ్‌, ఫకార్‌, బాబర్‌, షోయబ్‌ మాలిక్‌, సర్ఫరాజ్‌ (కెప్టెన్‌), అసిఫ్‌ అలీ, షాదాబ్‌, ఫహీమ్‌, ఆమిర్‌, హసన్‌, ఉస్మాన్‌ ఖాన్‌

Untitled Document
Advertisements