భారత్ ఘన విజయం: మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు

     Written by : smtv Desk | Thu, Sep 20, 2018, 03:47 PM

భారత్ ఘన విజయం: మాజీ క్రికెటర్లు ప్రశంసల జల్లు

ఆసియా కప్‌లో భాగంగా బుధవారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్, పాకిస్థాన్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. వరుసగా రెండు మ్యాచ్ లలో విజయాలను సొంతచేసుకోవడంతో టీమిండియాపై ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచ్ అనంతరం టీమిండియాపై మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్ లు ప్రశంసల జల్లు కురిపించారు.

'ఘన విజయం సాధించిన టీమిండియాకు శుభాకాంక్షలు. జట్టు కలిసికట్టుగా ఆడి విజయం సాధించింది. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు' అని వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

'టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. ముఖ్యంగా విపరీతమైన వేడిలో కూడా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో భారత్ గెలవడం గొప్ప విషయం. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. టీమిండియాను కెప్టెన్ రోహిత్ సమర్థంగా నడిపించాడని' లక్ష్మణ్ ట్వీట్ చేశారు.

Untitled Document
Advertisements