తెరాస కు బాబుమోహన్ ఝలక్

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 04:45 PM

తెరాస కు బాబుమోహన్ ఝలక్

ఆందోల్ తాజా మాజీ ఎమ్మెల్యే బాబూ మోహన్ ఈరోజు ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆయనకు కమల కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌తో కలిసి ఢిల్లీ వెళ్లిన మోహన్ గట్టి హామీ తర్వాతే బీజేపీలో చేరినట్లు తెలుస్తోంది.

ఆయన ఆందోల్ నుంచి బీజేపీ టికెట్ కోరంగా అందుకు పార్టీ ఒప్పుకుందని సమాచారం. హైకమాండ్ హామీ ఇవ్వడంతో ఆయన ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అందోల్‌ నుంచి గెలుపొందిన బాబుమోహన్‌కు మళ్లీ టికెట్ ఇవ్వడానికి టీఆర్ఎస్ వి ముఖత చూపింది. ఆయనకు బదులుగా సీనియర్ జర్నలిస్టు క్రాంతికుమార్ చంటికి టికెట్ ఇచ్చింది. దీంతో బాబూ మోహన్ బీజేపీలోకి జంప్ అయ్యారు. బాబూ మోహన్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, అధికారులను, కార్యకర్తలను బండబూతులు తిట్టడం, ఇతర కారణాలతో కేసీఆర్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. కాగా, ఆందోల్లో బాబు చేరికతో తమకు కాస్త బలం చిక్కుతుందని బీజేపీ ఆశిస్తోంది.

Untitled Document
Advertisements