దేవదాస్ ఫ్రీమేక్

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 05:29 PM

దేవదాస్  ఫ్రీమేక్

సినిమా రిలీజ్ టైంలో ఇదో డిఫరెంట్ కథ.. అసలు ఇంతవరకు ఇలాంటి కథతో సినిమా రాలేదు.. ఐదారుగురు రైటర్స్ ఈ కథకు పనిచేశారు అన్న కామెంట్స్ రావడం కామనే.. అయితే అసలు కథ ఏంటి అన్నది సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇక ఈమధ్య వచ్చిన నాగ్, నానిల మల్టీస్టారర్ మూవీ దేవదాస్ కూడా ఇలానే బిల్డప్ ఇచ్చారు. తీరా చూస్తే అది మళయాల సినిమా డిటో దించేశారని అర్ధమవుతుంది.

దేవ.. దాస్ కలిసి చేసిన ఈ దేవదాస్ సినిమా మళయాలంలో మమ్ముట్టి, శ్రీనివాసం చేసిన భార్గవచరితం మూనం కాండం ఫ్రీమేక్ అని తెలుస్తుంది. ఆ సినిమాలో కూడా డాన్ అయిన మమ్ముట్టిని డాక్టర్ అయిన శ్రీనివాసం కాపాడుతాడు. ఇద్దరు స్నేహితులవుతారు.. డాక్టర్ శ్రీనివాసం డాన్ మనసుని ఎలా మార్చాడు అన్నదే సినిమా కథ.

సేం టూ సేం దేవదాస్ సినిమా కూడా అదే. కాకపోతే ఈ దేవదాస్ లు కాస్త కామెడీ.. రొమాంటిక్ యాంగిల్ లో కనిపించారు. శ్రీరాం ఆదిత్య డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా కథ కోసం చాలామంది పనిచేశారని రిలీజ్ ముందు అన్నారు. మరి కాపీ కథకు అంతమంది ఎందుకు పనిచేయాల్సి వచ్చిందో వారికే తెలియాలి.

Untitled Document
Advertisements